ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఆందోళనలు కేంద్రానికి పట్టవా..?

ABN, First Publish Date - 2020-12-15T06:54:42+05:30

నల్లచట్టాలను రద్దు చేయాలని 18 రోజులుగా ఢిల్లీలో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించటం దుర్మార్గమని అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ, కా ర్మిక సంఘాల నాయకులు విమర్శించారు.

బీఎ్‌సఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 14:  నల్లచట్టాలను రద్దు చేయాలని 18 రోజులుగా ఢిల్లీలో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరించటం దుర్మార్గమని అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ, కా ర్మిక సంఘాల నాయకులు విమర్శించారు. సోమవారం స్థానిక బీఎ్‌సఎన్‌ఎల్‌ కార్యాలయం ఎదుట రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతుల ఆందోళనకు సంఘీభావంగా ధర్నా నిర్వహించారు. సీపీఐ, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, రాజారెడ్డి, అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు కాటమయ్య, మల్లికార్జున, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్లచట్టాలతో రైతుల హక్కులు హరిస్తోందన్నారు. కార్యక్రమంలో రైతుసంఘాల నాయకులు బండి రామకృష్ణ, మహదేవ్‌, చలపతి, నగేష్‌, సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌, కృష్ణమూర్తి, బాలరంగయ్య, ప్రగతిశీల మహిళా నాయకురాలు అరుణ, నాగరాజు, రాయుడు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి రాజే్‌షగౌడ్‌, అధ్యక్షుడు కృష్ణుడు, రైతులు పాల్గొన్నారు.


రైతుల ఆందోళనకు విద్యార్థుల మద్దతు

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా బీసీ విద్యార్థి సంఘం నాయకులు సోమవారం స్థానిక మహాత్మ జ్యోతీరావ్‌ ఫూలే విగ్రహానికి వినతిపత్రం అందజేసి, ఆం దోళన నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు విష్ణువర్దన్‌, కేశవ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మధు, నగర అధ్యక్షుడు ఖాదర్‌ బా షా, భరత్‌యాదవ్‌, రమేష్‌, పవన్‌, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising