ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎంలో డబ్బు కాజేసిన ప్రైవేట్‌ ఉద్యోగి అరెస్టు

ABN, First Publish Date - 2020-11-29T06:05:43+05:30

ఏటీఎంలో డబ్బు కాజేసిన ప్రైవేట్‌ ఉద్యోగిని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేసి, అతడి నుంచి రూ.10.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వన్‌టౌన్‌ సీఐ ప్రతా్‌పరెడ్డి.. ఎస్‌ఐలు చాంద్‌బాషా, విజయభాస్కర్‌, ఏఎ్‌సఐలు వెంకటకృష్ణ, నాగేశ్వరరెడ్డితో కలిసి శనివారం వివరాలను వెల్లడించారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ ప్రతా్‌పరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.10.38 లక్షల నగదు స్వాధీనం

అనంతపురం క్రైం, నవంబరు 28: ఏటీఎంలో డబ్బు కాజేసిన ప్రైవేట్‌ ఉద్యోగిని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేసి, అతడి నుంచి రూ.10.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వన్‌టౌన్‌ సీఐ ప్రతా్‌పరెడ్డి.. ఎస్‌ఐలు చాంద్‌బాషా, విజయభాస్కర్‌, ఏఎ్‌సఐలు వెంకటకృష్ణ, నాగేశ్వరరెడ్డితో కలిసి శనివారం వివరాలను వెల్లడించారు. ముంబైకి చెందిన రైటర్స్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జిల్లాలోని వివిధ ఏటీఎంలలో క్యాష్‌ లోడింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదర్చుకుంది. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులను నియమించుకుంది. 9 నెలల కిందట కంపెనీలో చేరిన అనంతపురం రూరల్‌ మండలంలోని సిండికేట్‌నగర్‌కు చెందిన దేవరకొండ సాయికుమార్‌ క్యాష్‌ లోడింగ్‌కు వెళ్లేవాడు. లాక్‌డౌన్‌ సమయంలో క్యాష్‌ లోడింగ్‌కు వెళ్లిన సమయాల్లో ఆ సొమ్ము కాజేసేందుకు పథకం వేశాడు. నగరంతోపాటు కూడేరు, గార్లదిన్నె తదితర ప్రాంతాల్లోని ఏటీఎంలలో క్యాష్‌ లోడింగ్‌ చేసిన తరువాత ఒక్కడే ఏటీఎంలోకి వెళ్లి, అందులోని నగదు కాజేశాడు. ఇలా రూ.18.97 లక్షలు కొట్టేశాడు. ఆడిట్‌లో వ్యవహారం బయటపడింది. దీనిపై మూడ్రోజుల కిందట కంపెనీ సూపర్‌వైజర్‌ రామాంజనేయులు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కంపెనీలో పనిచేస్తూ డబ్బు కాజేసిన నిందితుడు దేవరకొండ సాయికుమార్‌ను శనివారం నగరంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద అరెస్టు చేశారు.


Updated Date - 2020-11-29T06:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising