ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు నారా లోకేశ్‌ రాక

ABN, First Publish Date - 2020-10-22T10:39:40+05:30

రేపు నారా లోకేశ్‌ రాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాలతో దెబ్బతిన్న పంటలను 

పరిశీలించనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి..

బాధిత రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం


అనంతపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ జిల్లాలో ఒక రోజు పర్యటన ఖరారైంది. ఈనెల 23న ఆయన జిల్లాకు రానున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు గుత్తి సమీపంలోని జిల్లా స రిహద్దుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘన స్వా గతం పలికేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. నారా లోకేశ్‌ గుంతకల్లు నియోజకవర్గంలోని ధర్మాపురం, పామిడి మండలంలోని పొగరూరు, పెద్దవడుగూరు మండలం మిడుతూరు, గార్లదిన్నె మండలం రామదాసుపేట, రాప్తాడు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించనున్నారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడనున్నారు. వారిలో భరోసా నింపటంతోపాటు క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నారా లోకేశ్‌ పర్యటన నాలుగు నియోజకవర్గాల్లో సాగనుంది. ఆ మేరకు ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Updated Date - 2020-10-22T10:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising