ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కట్టడిలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు మొదటి స్థానం : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-09-21T09:36:39+05:30

కొవిడ్‌ కట్టడిలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు మొదటి స్థానం : కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యలు, బాధితులకు వైద్య సేవల్లో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం లభించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాంకులు విడుదల చేసినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 12 కొవిడ్‌ ఆస్పత్రులకు 24,201.8 పాయింట్లు కేటాయించారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అత్యధిక పాయింట్లు జిల్లాకు దక్కడంతోనే మొదటిస్థానం సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కదిరి కొవిడ్‌ ఆస్పత్రికి అత్యధికంగా 2346.5 పాయింట్లు లభించగా, వైఎ్‌సఆర్‌ మెమోరియల్‌ ఆస్పత్రికి 2309.9 పాయింట్లు, గుంతకల్లు ఏరియా ఆస్పత్రికి 2146.5, హిందూపురం ప్రభుత్వాస్పత్రికి 2089.9, చంద్ర సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి 2069.9, పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రికి 2036.5, కేన్సర్‌ ఆస్పత్రికి 2026.5, కేర్‌అండ్‌క్యూర్‌ ఆస్పత్రికి 1969.9, ప్రభుత్వ సర్వజనాస్పత్రికి 1966.55, కిమ్స్‌ సవేరా ఆస్పత్రికి 1943.25, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి 1659.9, బత్తలపల్లి ఆర్డీటీకి 1636.5 పాయింట్లు లభించినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ కట్టడిలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కష్టపడి పనిచేసిన జిల్లా యంత్రాంగం, అధికారులు, వైద్యులు, సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు.


Updated Date - 2020-09-21T09:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising