ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా చికిత్సల అలసత్వంపై ఆగ్రహం

ABN, First Publish Date - 2020-07-14T11:18:44+05:30

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నా బాధితులకు అవసరమైన వసతులు, చికిత్స అందించడంతో జిల్లా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎంహెచ్‌ఓ కార్యాలయం 

ముట్టడికి సీపీఎం నేతల యత్నం


అనంతపురం వైద్యం, జూలై 13: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నా బాధితులకు అవసరమైన వసతులు, చికిత్స అందించడంతో జిల్లా యంత్రాంగం అలసత్వం వహిస్తోందని సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా యంత్రాంగం తీరును నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యశాఖ కార్యాలయం ముట్టడికి సీపీ ఎం నేతలు, కార్యకర్తలు యత్నించారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు.   సీపీ ఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌ కేంద్రాల్లో సరైన వసతులు, వైద్యసేవలు అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.


జిల్లా అధికారుల మధ్య సమన్వయలోపం కరోనా బాధితులకు శా పంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.  జిల్లా సర్వజనాస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చడం వల్ల సాధారణ రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు కరోనా ము సుగులో పేద రోగులను దోచుకుంటున్నాయన్నారు.  కార్యక్రమంలో సీపీఎం నాయకులు రా మిరెడ్డి, ఆంజనేయులు, వెంకటనారాయణ, రామాంజనేయులు, రఫిక్‌, మసూద్‌, చంద్రిక, నాగరాజు, మద్దన్న, శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T11:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising