ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతులేని కథ

ABN, First Publish Date - 2020-11-27T06:06:45+05:30

అంగన్‌వాడీ నియామకాల ప్రక్రియ అంతులేని కథలా సాగుతోంది. నోటిఫికేషన్‌ మళ్లీ రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆది నుంచీ ఈ నియామకాలకు ఏదో ఒక రూపంలో సమస్య ఎదురవుతూనే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంగన్‌వాడీ నోటిఫికేషన్‌ మళ్లీ రద్దయ్యే చాన్స్‌..!

దరఖాస్తుల పరిశీలన నిలిపివేత..

జిల్లా కేంద్రంలోనేసీడీపీఓల తిష్ట

కొత్త రోస్టర్‌ ప్రక్రియ కొలిక్కి

నేడో.. రేపో.. నోటిఫికేషన్‌  ?

అనంతపురం వైద్యం, నవంబరు26: అంగన్‌వాడీ నియామకాల ప్రక్రియ అంతులేని కథలా సాగుతోంది. నోటిఫికేషన్‌ మళ్లీ రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆది నుంచీ ఈ నియామకాలకు ఏదో ఒక రూపంలో సమస్య ఎదురవుతూనే ఉంది. టీడీపీ హయాంలో నోటిఫికేషన్‌ ఇచ్చి, దరఖాస్తులు స్వీకరించారు. పరిశీలన అనంతరం నాయకుల మధ్య సఖ్యత కుదరక నియామకాలు ఆగిపోయాయి. అంతలోనే ఎన్నికలు రావటంతో ఆ ప్రక్రియ మరుగున పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్తగా ఇచ్చింది. దరఖాస్తులు తీసుకుని, అక్టోబరులో ఇంటర్వ్యూలు నిర్వహించారు. రోస్టర్లపై ప్రజాప్రతినిధులు అభ్యంతరం చెప్పటంతో నోటిఫికేషన్‌ను కలెక్టర్‌ రద్దు చేశారు. అనంతరం 15 రోజులపాటు కుస్తీ పడి, పది రోజుల క్రితం మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం 844 పోస్టులకు 2564 మంది దరఖాస్తు చేసుకున్నారు. గురు, శుక్రవారాల్లో వాటి పరిశీలన చేపట్టాలిఒ్స ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ రోస్టర్ల సమస్య తలెత్తింది. ఐదు రోజులుగా జిల్లా కలెక్టర్‌, జేసీలు ఈ రోస్టర్‌ వ్యవహారంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సీడీపీఓల ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది వివరాలను కులాల వారీగా సేకరించారు. ఏయే గ్రామంలో ఏ కులం వారు అధికంగా ఉన్నారన్న వివరాలను సీడీపీఓలను జిల్లా కేంద్రానికి రప్పించి, నివేదికలు తయారు చేయిస్తున్నారు. గురువారం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు డ్వామా కార్యాలయంలోని సమావేశ మందిరంలో సీడీపీఓలు తిష్ట వేసి, సమాచారం సేకరించారు. కుల జనాభా ఆధారంగా రోస్టర్‌ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీంతో రోస్టర్లు మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విడుదల చేసిన అంగన్‌వాడీల నోటిపికేషన్‌ రద్దు కాబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నేడో, రేపో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది.

Updated Date - 2020-11-27T06:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising