ఇంజనీరింగ్ ప్రవేశాలకు శ్రీకారం
ABN, First Publish Date - 2020-12-29T06:13:19+05:30
ఇంజనీరింగ్ విద్య ఫీజులు ఖరారు కావటంతో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. నె లల తరబడి ఎదురుచూస్తున్న విద్యార్థులకు వెబ్‌కౌన్సెలింగ్‌తో ఊర ట కలిగింది.
ప్రారంభమైన ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
హెల్ప్‌లైన్ సెంటర్ల ఏర్పాటు
అనంతపురం అర్బన్, డిసెంబరు 28: ఇంజనీరింగ్ విద్య ఫీజులు ఖరారు కావటంతో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. నె లల తరబడి ఎదురుచూస్తున్న విద్యార్థులకు వెబ్‌కౌన్సెలింగ్‌తో ఊర ట కలిగింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 31న ముగియనుంది. జిల్లాలో జేఎన్‌టీయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు వా రికి వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏరోజు ఎవరు ఆప్షన్లు ఇచ్చుకోవాలో షెడ్యూల్‌లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా కళాశాలల జాబితా లు వాటికి ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ కేటాయించిన ర్యాంకుల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
35 వేలకుపైగా సీట్లు
జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలతోపాటు 76 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో అనంతపురం 10, చిత్తూరు 23, కడప 15, కర్నూలు 11, నెల్లూరు 17 కళాశాలలు ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నాయి. వీటికి మా త్రమే కౌన్సెలింగ్‌కు అనుమతి ఉంది. ప్రస్తుతం 35 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో కొత్త కోర్సులతో కలిపి ఏడెనిమిది బ్రాంచ్‌లు ఉండగా చాలా వరకు సివిల్, మెకానికల్, ఎలక్ర్టికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ర్టా నిక్స్ వంటి బ్రాంచ్‌లే ఉన్నాయి. రెండు నెలల కిందటే ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. ప్రస్తుతం ఆప్షన్ల ఎంపికకు మూడు రోజులే సమయం ఇవ్వటంపై విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఆప్షన్ల ఎంపిక నుంచి సర్టిఫికెట్ల విచారణ వరకు ఏం కావాలన్నా కళాశాలకు వచ్చి నివృ త్తి చేసుకునే హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు.
షెడ్యూల్ ఇలా..
అక్టోబరు 23 నుంచి నవంబరు 3వరకు చేపట్టిన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకానివారు ప్రస్తుతం చేయించుకోవచ్చు. ఇందుకు సంబంధించి విద్యార్థులు జేఎన్‌టీయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాల్లో సంప్రదించొచ్చు. ఈనెల 29న స్పెషల్ కేటగిరీ విద్యా ర్థులకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 28, 29 తేదీల్లో మొదటి ర్యాంకు నుంచి 60వేల ర్యాంకు వచ్చినవారు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 30 నుంచి 31వ తేదీ వరకు 60001 నుంచి చివరి ర్యాంకు వచ్చినవారు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జనవరి 1న ఏదైనా ఆప్షన్లు మా ర్చుకోవాలంటే అవకాశం కల్పిస్తారు. జనవరి 3న సీట్లు కేటాయి స్తూ లెటర్లు పంపుతారు.
ఆఫర్లు నమ్మి మోసపోవద్దు..
కొన్ని కళాశాలలకు చెందిన పీఆర్వోలు చెప్పే మాటలకు తల్లిదండ్రులు పడిపోతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ఆ కళాశాలలో బో ధనా పద్ధతులు, మౌలిక సదుపాయాలు సరిగా లేక ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. ఫీజులో రాయితీ ఇస్తామని, ఉచిత బ స్సు సౌకర్యం కల్పిస్తామని, ల్యాప్‌టా్‌పలు ఇస్తామని, ఖరీదైన స్మా ర్టు ఫోన్లు ఇస్తామని ఇలా అనేక తాయిలాలతో విద్యార్థులను సం ప్రదించినపుడు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్‌ల నిర్వాహకులతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు సం బంధాలు పెట్టుకుని యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సేకరించటం ఇబ్బంది కలిగిస్తోంది.
30 మంది సర్టిఫికెట్ల పరిశీలన
ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరుకాని 30 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను జేఎన్‌టీయూ పరిపాలన విభాగంలో పరిశీలించారు.
Updated Date - 2020-12-29T06:13:19+05:30 IST