ఎస్‌బీ డీఎస్పీగా ఉమామహేశ్వరరెడ్డి బాధ్యతల స్వీకరణ
ABN, First Publish Date - 2020-12-15T07:00:43+05:30
జిల్లా పోలీసు శాఖ పరిధిలోని స్పెషల్ బ్రాంచి డీఎస్పీగా ఉమామహేశ్వరరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఎస్పీని కలిసిన ఎస్‌బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి
అనంతపురం క్రైం, డిసెంబరు 14: జిల్లా పోలీసు శాఖ పరిధిలోని స్పెషల్ బ్రాంచి డీఎస్పీగా ఉమామహేశ్వరరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుంతకల్లు సబ్ డివిజన్ ఇన్‌చార్జి డీఎస్పీగా పనిచేస్తున్న ఈయన ఇటీవల బదిలీల్లో భాగంగా ఇక్కడికొచ్చారు. దీంతో స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌బీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు సీఐలు, ఎ స్‌ఐలు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మర్యాదపూర్వకంగా ఎస్పీ సత్యఏసుబాబును కలిశారు. ఈయనకు గతంలో జిల్లా పోలీసుశాఖ పరిధిలో సీఐ, ఎస్‌ఐగా పనిచేసిన అనుభవం ఉంది.
Updated Date - 2020-12-15T07:00:43+05:30 IST