ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందూపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..వ్యక్తికి గాయాలు

ABN, First Publish Date - 2020-07-18T18:15:04+05:30

హిందూపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ..వ్యక్తికి గాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: చెత్త విషయంలో జరిగిన గొడవ ఒకరిని ప్రాణాపాయస్థితిలోకి నెట్టింది. జిల్లాలోని హిందూపురం మండలం కిరికెరలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న అశ్వతప్ప, నారాయణప్ప కుటుంబీకుల మధ్య చెత్త విషయంలో గొడవ చోటు చేసుకుంది. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నప్పటికీ...గత కొంత కాలంగా ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చెత్త విషయంలో గొడవ చోటు చేసుకుంది. చాకలి నారాయణప్ప ఇంటి వారు  అశ్వతప్ప ఇంటి వద్ద చెత్త వేయడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో కుటుంబాల మధ్య మాటా మాటా పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. అశ్వతప్పపై  చాకలి నారాయణప్ప, బాలు, రాకేష్ కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని  హిందూపురం ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు రూరల్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - 2020-07-18T18:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising