ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంతకం పెట్టడం ఇష్టం లేకపోతే..తిరుమల వెళ్లడం దేనికి?: ఆనందబాబు

ABN, First Publish Date - 2020-09-23T18:24:30+05:30

నిరాధార ఆరోపణలతో తెలుగుదేశం పార్టీపై బురదజల్లేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నిరాధార ఆరోపణలతో తెలుగుదేశం పార్టీపై బురదజల్లేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, సంతకం పెట్టడం ఇష్టం లేకపోతే.. అసలు తిరుమల వెళ్లడం దేనికని ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్, మనీల్యాండరింగ్, క్విడ్ ప్రోకో పదాలను.. ప్రజలకు పరిచయం చేసింది జగన్, విజయసాయిరెడ్డేనని ఆయన అన్నారు.


రాజధాని ప్రకటన వచ్చిన తర్వాత భూములు కొంటే.. అది తప్పెలా అవుతుందని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలయినప్పుడు లోకేష్ మంత్రిగానే లేరన్నారు. అలాంటప్పుడు రూ.2 వేలకోట్ల అవినీతి ఎలా చేశారని ప్రశ్నించారు. నూటికి 80 శాతం మంది దళితులు వైసీపీకి ఓటేస్తే.. ప్రభుత్వం వారికి హత్యలు, దాడులు, శిరోముండనాలను కానుకగా ఇచ్చిందని నక్కా ఆనందబాబు విమర్శించారు.

Updated Date - 2020-09-23T18:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising