ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతులను అన్యాయంగా జైలులో పెట్టారు: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-10-28T22:08:01+05:30

అమరావతి రైతులను అన్యాయంగా జైలులో పెట్టారని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వ అణచివేత పరాకాష్టకు చేరిందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అమరావతి రైతులను అన్యాయంగా జైలులో పెట్టారని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వ అణచివేత పరాకాష్టకు చేరిందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని, రైతులకు పోటీగా ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి... పెయిడ్ ఉద్యమం నడిపించటం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులపైనే అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం దేశంలోనే తొలిసారన్నారు. రైతులకు బేడీలు వేయటంతోనే ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని రామకృష్ణ హెచ్చరించారు.


అమరావతి ప్రాంత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఏడుగురు రైతులను పోలీసులు మంగళవారం నరసరావుపేట సబ్‌ జైలు నుంచి గుంటూరు జైలుకు తరలించారు. ఇద్దరిద్దరికి చొప్పున చేతులకు బేడీలు వేసి మరీ రిమాండుకు పంపించారు. కరుడుగట్టిన నేరస్తులు, బందిపోటు దొంగలు, తీవ్రవాదులు, రౌడీషీటర్లు, శిక్ష పడిన ఖైదీలకు భద్రతా కారణాల దృష్ట్యా చేతులకు బేడీలు వేస్తుంటారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో కోర్టు అనుమతి తీసుకుని బేడీలు వేయటం సహజంగా జరుగుతుంది. అయితే... ఇప్పుడు రాజధాని రైతులకు బేడీలు వేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని హక్కుల సంఘాల నాయకులు, న్యాయవాదులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-10-28T22:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising