ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంసెట్‌ వాయిదా!

ABN, First Publish Date - 2020-04-09T09:28:58+05:30

ఎంసెట్‌ వాయిదా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలోనే అధికారిక ప్రకటన


అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ తీవ్రత.. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ఎంసెట్‌-2020 వాయిదా అనివార్యంగా మారింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20 నుంచి 24 వరకు ఈ పరీక్ష ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారితం)లో నిర్వహించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌)కు దరఖాస్తుల సమర్పణ గడువును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ నెల 17 వరకు పొడిగించించిన విషయం తెలిసిందే.  ఆలస్య రుసుంతో దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీలు, దరఖాస్తుల్లో సవరణ , హాల్‌ టికెట్ల డౌన్‌లోడింగ్‌ తదితర వివరాలను త్వరలో తెలియజేస్తామని ఉన్నత విద్యా మండలి తాజాగా తెలిపింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తయిన నాటి నుంచి హాల్‌ టికెట్ల జనరేషన్‌, వాటిని అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అవసరమని టీసీఎస్‌ ఇప్పుడు ఉన్నత విద్యామండలికి చెప్పడంతో షెడ్యూల్‌ ప్రకారం ఎంసెట్‌ జరిగే అవకాశం లేదని స్పష్టమైంది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై స్పష్టత రాగానే కొత్త షెడ్యూల్‌ ప్రకటిస్తామని మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Updated Date - 2020-04-09T09:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising