ఏపీలో జిల్లాల పునర్విభజనకు నాలుగు సబ్ కమిటీల ఏర్పాటు
ABN, First Publish Date - 2020-08-22T18:36:33+05:30
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు ఏర్పాటు చేసిన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అమరావతి: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు ఏర్పాటు చేసిన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి సబ్ కమిటీ-1... నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి సబ్ కమిటీ-2... ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి సబ్ కమిటీ-3.... ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్ కమిటీ-4లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీ సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైర్మన్‍గా కలెక్టర్‍తో పాటు 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది. అలాగే ఏపీసీఎఫ్‍ఎస్‍ఎస్ సీఈవో అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీకి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమికంగా ఆరు నెలల పాటు ప్రత్యేక ఆఫీస్ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
Updated Date - 2020-08-22T18:36:33+05:30 IST