ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LIVE: జగన్ ఏడాది పాలన అంతా చేదేనా?

ABN, First Publish Date - 2020-05-30T13:31:07+05:30

LIVE: జగన్ ఏడాది పాలన అంతా చేదేనా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ ప్రారంభమై ఏడాది గడుస్తోంది. ప్రత్యేక హోదా ఎట్టిపరిస్థితుల్లో సాధిస్తామని గడిచిన ఎన్నికల్లో వైసీపీ తెలిపింది. కాగా అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదాలపై వైసీపీ సర్కార్ ఏం చేసిందనేది చర్చనీయాంశమైంది. అమరావతి తరలించాలనే ఆలోచనలో వైసీపీ సర్కార్ ఉంది. మరో అంశం పోలవరం. దాదాపు 70శాతం పనులు పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితులు ఎక్కడా కనబడటం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రూ.1800కోట్లకు పైగా నిధులు పోలవరానికి కేటాయించిన నిధులను ఇతర ప్రాజెక్టులకు ప్రభుత్వం మళ్లించిందనే విమర్శలు  కూడా వెల్లువెత్తుతున్నాయి.


మరోవైపు ప్రత్యేక హోదాకు సంబంధించి అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎక్కడా చర్చించిన దాఖలాలు లేవు. 25మంది ఎంపీలను ఇస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను తీసుకువస్తామని చెప్పిన సర్కారు...22 మంది ఎంపీలు గెలిచిన తర్వాత...కేంద్రంలో మెజార్టీ బీజేపీ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్లని అడగలేని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చింది. రెండు రోజుల క్రితం కూడా ప్రత్యేక హోదాను వదిలేయలేదని, హోదా కోసం పోరాటం సాగుతూనే ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. ఈ మూడు అంశాలకు సంబంధించి గత ఏడాది కాలంగా ఏం జరిగిందనే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మార్నింగ్ ఇష్యూలో చర్చ నిర్వహించారు. ఈ చర్చలో జనసేన నేత శ్రీనివాస్, కాంగ్రెస్ నేత అంబటి రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ, బీజేవైఎమ్ స్టేట్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 



Updated Date - 2020-05-30T13:31:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising