ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నూతన పారిశ్రామిక పాలసీ: రోజా

ABN, First Publish Date - 2020-08-10T18:37:24+05:30

పెట్టుబడులకు ఏపీ అనుకూలంగా ఉందని....అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కొత్త పాలసీని తీసుకువచ్చామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పెట్టుబడులకు ఏపీ అనుకూలంగా ఉందని....అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కొత్త పాలసీని తీసుకువచ్చామని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా తెలిపారు. సోమవారం రాష్ట్ర పారిశ్రామిక నూతన పాలసీని మంత్రి గౌతమ్‌, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా విడుదల చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఫార్మా, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రో కెమికల్స్ సహా....కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఉంటాయని తెలిపారు. మార్చి నెలతో పాత పాలసీ ముగిసిందని.. దాదాపు 8 నెలల నుంచి కొత్త పాలసీపై కసరత్తు చేశామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ పాలసీకి, ఆచరణకు పొంతన లేదని విమర్శించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడమే తొలి ప్రాధాన్యత ఇస్తామని రోజా స్పష్టం చేశారు.


రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన  ప్రభుత్వం

2020-23 సంవత్సరాలకు గాను నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పారిశ్రామిక అనుమతుల వేగవంతానికి.. వైఎస్సార్ వన్ పేరుతో సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేసింది. కొత్తగా 10 రంగాల్లో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలను నూతన పాలసీలో ప్రభుత్వం కేటాయించింది. 

Updated Date - 2020-08-10T18:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising