ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ చట్టానికి తూట్లు: ఏఐటీయూసీ

ABN, First Publish Date - 2020-10-21T08:43:02+05:30

కేంద్ర ప్రభుత్వం 2003 విద్యుత్‌చట్టానికి తూట్లు పొడుస్తూ 2020 సంస్కరణల పేరుతో ఇటీవల పార్లమెంట్‌లో తెచ్చిన బిల్లు వల్ల రాష్ట్రాల అధికారాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 2003 విద్యుత్‌చట్టానికి తూట్లు పొడుస్తూ 2020 సంస్కరణల పేరుతో  ఇటీవల పార్లమెంట్‌లో తెచ్చిన బిల్లు వల్ల రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కోవడమే గాక విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించిందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబులేసు ఒక ప్రకటనలో విమర్శించారు. దీంతో అటు కార్మికులు, ఇటు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్‌ రేట్లు పెంచి అన్యాయం చేస్తున్నారన్నారు. దీన్ని నిరసిస్తూ దేశ వ్యాప్త ఆందోళనల్లో  భాగంగా రాష్ట్రంలోని అన్ని సంఘాలు ఉత్పత్తికి ఆటంకం లేకుండా సోమవారం నుంచి భోజన విరామ సమయాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారని తెలిపారు.  అన్ని కార్మిక సంఘాల జేఏసీ ఆందోళన చేయడానికి ఉపక్రమించగానే సమ్మెలు చేయడానికి వీలులేదని సర్క్యులర్‌ జారీచేయడం దారుణమని పేర్కొన్నారు. విద్యుత్‌ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్‌టీపీపీ, వీటీపీఎ్‌సలలో నిలిపేసిన ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-21T08:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising