ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటికే మధ్యాహ్న భోజనం సరుకులు

ABN, First Publish Date - 2020-03-26T12:34:40+05:30

ఇంటికే మధ్యాహ్న భోజనం సరుకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కరోనా సెలవులతో విద్యాశాఖ చర్యలు   

నెల్లూరు/సీతారామపురం: కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ విద్యార్థుల ఇళ్లకే వెళ్లి మధ్యాహ్న భోజనం సరుకులను అందిస్తోంది. విద్యార్థులకు పౌష్ఠికాహార లోపం తలెత్తకుండా సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను అనుసరించి ఈ మేరకు చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయాల విద్యా సంక్షేమ సహాయకులు, వలంటీర్ల సహకారంతో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కరోనా సందర్భంగా పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం వలంటీర్ల సహాయంతో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు కిలో బియ్యం, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 1.5 కిలోల బియ్యంతో పాటు 4 చిక్కీలు, 8 కోడిగుడ్లు అందజేస్తుంది. దీంతో మండలంలోని 43 పాఠశాలలకు చెందిన 2306 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 

Updated Date - 2020-03-26T12:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising