ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్‌ అవుతున్న వైసీపీ నేతల నేరాల చిట్టా

ABN, First Publish Date - 2020-02-14T17:49:53+05:30

నేరచరిత్ర ఉన్న నేతలు ఏపీ సర్కారులో ఎంతెంత మంది ఉన్నారన్న దానిపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) ఓ ప్రత్యేక నివేదికను వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నేరచరిత్ర ఉన్న నేతలు ఏపీ సర్కారులో ఎంతెంత మంది ఉన్నారన్న దానిపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) ఓ ప్రత్యేక నివేదికను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. 2019 ఎన్నికల్లో గెలిచి.. మంత్రులుగా ఎంపికయిన వారిలో ఎవరెవరికి నేరచరిత్ర ఉంది..? వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి..? మంత్రుల విద్యార్హతలు, ఆస్తుల వివరాలను ఏడీఆర్ ఈ నివేదికలో పొందుపరిచింది. నేరాలు, కేసుల చిట్టా ఉన్న ఒక్కో ఎమ్మెల్యే పేరును ప్రస్థావిస్తూ.. వారిపై ఏఏ కేసులు.. ఎప్పుడెప్పుడు నమోదయ్యాయి..? ప్రస్తుతం ఆయా కేసుల్లో ఏమైనా  పురోగతి ఉందా..? అన్న విషయాలను కూడా ఏడీఆర్ వెల్లడించింది. 

(వైరల్‌గా మారిన వైసీపీ నేతల నేరాల చిట్టా.. రిపోర్టు కోసం క్లిక్ చేయండి..)

కాగా.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పైనే ఏకంగా 38 కేసులు ఉండటాన్ని ఏడీఆర్ రిపోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ తర్వాత మేకపాటి గౌతమ్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, శంకర నారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, కొడాలి నాని, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్పశ్రీ వాణి.. వంటి నేతలందరిపై ఉన్న కేసుల వివరాలను కూడా ఈ ఏడీఆర్ రిపోర్టు బహిర్గతం చేసింది. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలపై ఏ ఏ కేసులు ఉన్నాయి..? అన్న విషయాలు కూడా ఈ రిపోర్టులో ఉన్నాయి.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఆ రిపోర్టును మీరూ ఓ లుక్కేయండి.. 

(వైరల్‌గా మారిన వైసీపీ నేతల నేరాల చిట్టా.. రిపోర్టు కోసం క్లిక్ చేయండి..)

Updated Date - 2020-02-14T17:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising