ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ కేసుల విచారణ 27కు వాయిదా

ABN, First Publish Date - 2020-10-21T08:42:26+05:30

సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ నెల 15న జరగాల్సిన విచారణను,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ నెల 15న జరగాల్సిన విచారణను, 20వ తేదీ వాయిదా వేయగా, మంగళవారం విచారణకు రావాల్సిన కేసులను మళ్లీ 27వ తేదీకి వాయిదా వేశారు. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ మధుసూదనరావు సెలవులో ఉండడంతోపాటు దసరా పండగ నేపథ్యంలో కేసుల విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. ఇదిలావుంటే, మెట్రో పాలిటన్‌ సెషన్‌ జడ్జి(ఎంఎ్‌సజే కోర్టు) పరిధిలో ఉన్న ఈడీ కేసు నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. కాగా, జగన్‌ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈ కేసును కూడా బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ నవంబరు 5వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు. సీఎం జగన్‌కు సంబంధించిన అన్ని కేసులు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉండగా, ఈడీ కేసు మాత్రం ఎంఎ్‌సజే కోర్టు విచారణలో ఉంది.

Updated Date - 2020-10-21T08:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising