ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LIVE: ఏపీలో ఏసీబీ అధికారుల తీరుపై హైకోర్టు సీరియస్

ABN, First Publish Date - 2020-07-09T13:16:13+05:30

LIVE: ఏపీలో ఏసీబీ అధికారుల తీరుపై హైకోర్టు సీరియస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ఏసీబీ అధికారుల వ్యవహార శైలిపైన హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు సంబంధించిన అంశంపై హైకోర్టు నిన్న సీరియస్ అయ్యింది. అరెస్ట్ చేసిన సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే వ్యాఖ్యలు చేసింది. ఆయన అనారోగ్యంగా ఉన్నారు, ఆపరేషన్ జరిగిందనే విషయాన్ని పదే పదే చెబుతున్నప్పటికీ 600 కిలోమీటర్లు ఆయనను ఏరకంగా ప్రయాణం చేయించారు అనే విషయాన్ని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అధికారులు చెబుతున్న దాంతో హైకోర్టు పూర్తిగా విభేదించింది. ఈ రకంగా మానవ హక్కుల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము అని చెప్పింది. హైకోర్టు ఆదేశాల తర్వాత నిన్న ప్రైవేటు ఆస్పత్రికి అచ్చెన్నాయుడిని తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


తమ పార్టీలకు సంబంధించిన నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారు...మానవ హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడుతోందని...అధికారులు మానవ హక్కులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీల నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. చాలా పార్టీలకు చెందిన నాయకులను అరెస్ట్‌ చేసి జైళ్లలో పెట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికారులు ఏమాత్రం కూడా మానవ హక్కులను పట్టించుకోవడం లేదు వంటి వ్యాఖ్యలు హైకోర్టు నుంచి రావడంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో టీడీపీ నేత దీపక్‌రెడ్డి, కాంగ్రెస్ నేత సుందర రామ శర్మ, బీజేపీ నేత దిలీప్ పాల్గొన్నారు. చర్చను ప్రతక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.  



Updated Date - 2020-07-09T13:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising