ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ ఎఫెక్ట్.. తిరుపతిలో కోవిడ్ ఆస్పత్రి

ABN, First Publish Date - 2020-04-05T15:58:04+05:30

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌తో తిరుపతిలోని రుయా ఆస్పత్రిని మొదట కోవిడ్ ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి : ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌తో తిరుపతిలోని రుయా ఆస్పత్రిని మొదట కోవిడ్ ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుయా కంటే తిరుపతిలోని టీటీడీకి చెందిన స్విమ్స్‌లోని శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రిను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రి చేయటం సబబు అని ‘ఆంధ్రజ్యోతి’లో పలుమార్లు కథనాలు వచ్చాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సూచనకు జిల్లా అధికారులు, వైద్యులు స్పందించారు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీకి చెందిన స్విమ్స్‌లోని శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇక కోవిడ్ ఓపి, ఐపీ సేవలతో ప్రత్యేక ఆసుపత్రిగా చేయాలని నిర్ణయించారు.


కాగా.. ప్రస్తుతం రుయా ఆస్పత్రి ఐసోలేషన్‌ ఉన్న 17మందిని కూడా కోవిడ్ ఆస్పత్రిగా నిర్దేశించిన శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రోజూ మూడు షిప్ట్టుల్లో పనిచేసే విధంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, అనస్తీషియా డాక్టర్లు, పీజి డాక్టర్లు, అవసరమైన కార్డియాలజీ, ఈఎన్టీ అందుబాటులో వుండే విధంగా జాభితా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.


కోవిడ్ ఆస్పత్రిగా ప్రకటించిన శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఆస్పత్రిలో ఇప్పటికే ఉన్న 150 బెడ్స్‌లో 30కు తక్షణమే వెంటిలేటర్లు  ఏర్పాట్లు చేయాలని, ఆ తర్వాత మిగిలిన వాటికి వెంటిలేటర్లు ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. రుయాలో పేదలకు అందించే సాధారణ  స్థాయి సేవలు లాక్ డౌన్ తరువాత అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-05T15:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising