‘ఎల్‌జీ’ ఘటనను వదిలిపెట్టం
ABN, First Publish Date - 2020-05-09T10:23:09+05:30
ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ దుర్ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు.
తేలిగ్గా తీసుకోవద్దని కొరియా రాయబారికి చెప్పాం
కమిటీ నివేదిక వచ్చాక చర్యలు: మేకపాటి
విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ దుర్ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. శుక్రవారం ఎల్‌జీ కంపెనీ అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దక్షిణ కొరియారాయబారితో మాట్లాడానని, ప్రాణాలు కోల్పోయిన ఘటనను లైట్‌గా తీసుకోరాదని స్పష్టం చేశానని తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్టైరిన్ స్టోరేజీ ట్యాంకులో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు నిపుణుల బృందం కృషి చేస్తోందని, 24 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. విశాఖ జిల్లాలో 86 కంపెనీలను ప్రమాద భరితమైనవిగా గుర్తించామని, వీటికి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాకే ఉత్పత్తికి అనుమతులు ఇస్తామన్నారు.
Updated Date - 2020-05-09T10:23:09+05:30 IST