ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
ABN, First Publish Date - 2020-11-03T18:49:59+05:30
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసులో విచారణ ధర్మాసనం నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. దీంతో ఈ కేసు శీతాకాలం సెలవుల తర్వాత మరో ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెంట్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ న్యాయస్థానం సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది.
Updated Date - 2020-11-03T18:49:59+05:30 IST