ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 8,096 కేసులు..

ABN, First Publish Date - 2020-09-19T09:39:37+05:30

రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. గురువారం నుంచి శుక్రవారం వరకు 74,710 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,096 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరి జిల్లాల్లో తగ్గని ఉధృతి

మరో 67 మంది మృతి 6,09,558కి  పెరిగిన పాజిటివ్‌లు

5,244కి చేరుకున్న మరణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. గురువారం నుంచి శుక్రవారం వరకు 74,710 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,096 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అ యినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,09,558కి పెరిగింది. తాజా గా తూర్పుగోదావరిలో అత్యధికంగా 1,405, పశ్చిమగోదావరిలో 1,035 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 11,803 మంది కరోనా నుంచి కోలుకో గా.. మొత్తం రికవరీలు 5.19 లక్షలకు చేరుకున్నాయి. కరోనా కాటుకి రాష్ట్రంలో మరో 67 మంది బలయ్యారు. కడపలో 8, చిత్తూరులో 7, కృష్ణాలో 7, తూర్పుగోదావరిలో 6, గుంటూరులో 6, విశాఖపట్నంలో 6, అనంతపురంలో 5, నెల్లూరులో 5, శ్రీకాకుళంలో 5, పశ్చిమగోదావరిలో 4, ప్రకాశంలో 3, విజయనగరంలో 3, కర్నూలులో ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,244కి పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇక్కడ రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. తూ ర్పుగోదావరిలో తాజాగా 1,405 మంది, పశ్చిమ గోదావరిలో 1,035 మంది కరోనా బారినపడ్డారు.

 

ద్రోణంరాజు శ్రీనివాస్‌ పరిస్థితి విషమం

ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు, మాజీ ఎ మ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఆరోగ్య పరిస్థితి విషమం గా మారింది. ఆయనకు కరోనా వైరస్‌ సోకడంతో 20 రోజులుగా విశాఖలోని పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే 3 రోజుల నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్య వర్గాల సమాచారం.  

Updated Date - 2020-09-19T09:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising