ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో మరో 8 కేసులు

ABN, First Publish Date - 2020-03-29T09:26:48+05:30

తెలంగా ణలో తొలి కరోనా మరణం నమోదైంది. ఇటీవలే ఢిల్లీలో ప్రార్థనా మందిరానికి వెళ్లొచ్చిన 74ఏళ్ల ఖైరతాబాద్‌ వాసి ఇతర జబ్బులతో బాధపడుతూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తెలంగా ణలో తొలి కరోనా మరణం నమోదైంది. ఇటీవలే ఢిల్లీలో ప్రార్థనా మందిరానికి వెళ్లొచ్చిన 74ఏళ్ల ఖైరతాబాద్‌ వాసి ఇతర జబ్బులతో బాధపడుతూ మృతి చెందాడు. చికిత్స సమయంలో ఆయన తీవ్ర న్యూమోనియా లక్షణాలతో బాధపడుతున్నారు. చనిపోయిన తరువాత అనుమానంతో ఆయన నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. శనివారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి.


దీంతో అక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య 67కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే 14 కేసులు నమోదు కాగా, రెండు రోజులు కలిపి 22  కేసులు అయ్యాయి. ఇదలాఉండగా, విమానాశ్రయం లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ విధుల్లో పాల్గొన్న నలుగురు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికీ కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. దీంతో వారి కుటుంబసభ్యులను ఐసోలేషన్‌లో ఉంచారు. మార్చి 22నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేశారు. ఇప్పటివరకు పాజిటివ్‌గా వచ్చిన 67మందిలో పదిమంది పూర్తిగా కోలుకున్నారు. వారికి తాజాగా జరిపిన పరీక్షల్లో నెగటివ్‌ వచ్చింది. వీరిని ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యవర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2020-03-29T09:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising