ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుల కుటుంబాలకు 50 లక్షలు: సీఎం

ABN, First Publish Date - 2020-08-10T09:38:00+05:30

విజయవాడలోని స్వర్ణ ప్యాలె్‌సలో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని స్వర్ణ ప్యాలె్‌సలో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పదిమంది మృతి చెందడంపై సీఎం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. కాగా, అగ్నిప్రమాదంపై  ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సీఎం జగన్‌కు ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను జగన్‌ ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి అవసరమైన సహాయసహకారాలను కేంద్రం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇక, అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దిగ్ర్భాంతి, విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మంచి చికిత్స అందించాలని కోరారు. సీఎం జగన్‌కు ఫోన్‌చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2020-08-10T09:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising