ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీర్రాజు జట్టులో 40 మంది

ABN, First Publish Date - 2020-09-14T08:50:50+05:30

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి 40 మందితో కొత్త కమిటీ ఏర్పాటైంది. నెలన్నర కింద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించిన జాతీయ నాయకత్వం.. వివిధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర బీజేపీకి కొత్త కమిటీ

విష్ణు, ఆది, రావెల సహా పది మంది ఉపాధ్యక్షులు

మాధవ్‌, విష్ణువర్ధన్‌ సహా ఐదుగురు కార్యదర్శులు

ఏడు మోర్చాలకు అధ్యక్షులు

కోశాధికారిగా సత్యమూర్తి

అన్ని ప్రాంతాలకూ ప్రాధాన్యం


అమరావతి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి 40 మందితో కొత్త కమిటీ ఏర్పాటైంది. నెలన్నర కింద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించిన జాతీయ నాయకత్వం.. వివిధ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని తాజాగా పూర్తి స్థాయి కమిటీని ప్రకటించింది. గతంలో ఉన్న జంబో కమిటీకి స్వస్తి పలికింది. పార్టీకి విధేయులుగా ఉన్నవారికి అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం కల్పించింది. ఉత్తరాంధ్రకు, సీమలో కడప జిల్లాకు పెద్దపీట వేసింది.


పది మంది ఉపాధ్యక్షుల్లో ముగ్గురు, పది మంది కార్యదర్శుల్లో నలుగురు మహిళలకు అవకాశం దక్కింది. వీర్రాజుకు శాసనమండలిలో సహచర సభ్యుడైన పీవీఎన్‌ మాధవ్‌ , విష్ణువర్ధన్‌రెడ్డి సహా ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, బీజేఎల్పీ మాజీ నేత విష్ణుకుమార్‌రాజు, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రావెల కిశోర్‌బాబు  సహా పది మంది ఉపాధ్యక్షులు, మరో పది మంది కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు నియమితులయ్యారు. మధుకర్‌ను పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. సత్యమూర్తి (విజయవాడ)ని కోశాధికారిగా నియమిస్తూ విజయవాడలోని రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అదే కార్యాలయం కార్యదర్శిగా పి.శ్రీనివాస్‌ (విజయవాడ) నియమితులయ్యారు. ఏడు పార్టీ అనుబంధ సంఘాలకు అధ్యక్షులను కూడా నియమించారు.


ఈ మేరకు వీర్రాజు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కమిటీలో చోటు దక్కిన పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులకు ఆయన శుబాకాంక్షలు తెలియజేశారు. రాజకీయాల్లో ఉత్సాహంతో, శక్తి సామర్థ్యాలు జోడించి పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి, పట్టుదలతో శ్రమించాలని సూచించారు. కార్యకర్తలందరినీ కలుస్తూ సమన్వయంతో పనిచేసి బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.


ఉపాధ్యక్షులు... విష్ణుకుమార్‌ రాజు (విశాఖపట్నం), ఆదినారాయణరెడ్డి(కడప), రావెల కిశోర్‌బాబు (గుంటూరు), రేలంగి శ్రీదేవి(రాజమండ్రి-తూర్పుగోదావరి), కాకు విజయలక్ష్మి(నెల్లూరు), మాలతీరాణి(ఏలూరు-పశ్చిమగోదావరి), నిమ్మక జయరాజు(కురుపాం-విజయనగరం). పైడి వేణుగోపాల్‌(పాలకొండ-శ్రీకాకుళం), పి.సురేందర్‌రెడ్డి (నెల్లూరు), చంద్రమౌళి(కర్నూలు).


ప్రధాన కార్యదర్శులు... ఎమ్మెల్సీ మాధవ్‌(విశాఖ), లోకుల గాంధీ(అరకు-విశాఖ), సూర్యనారాయణరాజు(కాకినాడ-తూర్పుగోదావరి), విష్ణువర్ధన్‌రెడ్డి(హిందూపురం-అనంతపురం), ఎన్‌.మధుకర్‌(సంస్థాగత వ్యవహారాలు).


కార్యదర్శులు... ఎస్‌.ఉమామహేశ్వరి(శ్రీకాకుళం), కండ్రిక ఉమ(తిరుపతి-చిత్తూరు), మట్టం శాంతికుమారి (అరకు- విశాఖ), ఎ.కమల(నెల్లూరు), కె.చిరంజీవిరెడ్డి(అనంతపురం), పాతూరి నాగభూషణం(గుంటూరు), కె.నీలకంఠ(కర్నూలు), బి.శ్రీనివాసవర్మ(నరసాపురం-పశ్చిమగోదావరి), నాగోతు రమేశ్‌నాయుడు(రాజంపేట-కడప), ఎం.సుధాకర్‌ యాదవ్‌(గుంటూరు).


అధికార ప్రతినిధులు... పూడి తిరుపతిరావు(శ్రీకాకుళం), సుహాసినీ ఆనంద్‌(విశాఖపట్నం), చందు సాంబశివరావు(గుంటూరు), కె.ఆంజనేయరెడ్డి(నెల్లూరు), సామంచి శ్రీనివాస్‌, భానుప్రకాశ్‌రెడ్డి(తిరుపతి-చిత్తూరు).


అనుబంధ సంస్థలు... యువమోర్చా-సురేంద్రమోహన్‌(విశాఖ), మహిళా మోర్చా-నిర్మలాకిశోర్‌(ఏలూరు-పశ్చిమగోదావరి), కిసాన్‌ మోర్చా-శశిభూషణ్‌రెడ్డి(కడప), ఎస్సీ మోర్చా-జి.దేవానంద్‌ (హిందూపురం-అనంతపురం), ఎస్టీ మోర్చా-కె.ఉమామహేశ్వరరావు(అరకు-విశాఖ), ఓబీసీ మోర్చా-బిట్రా శివనారాయణ(నరసరావుపేట-గుంటూరు), మైనారిటీ మోర్చా-ఎ్‌స.కె.బాజీ(విజయవాడ-కృష్ణా).

Updated Date - 2020-09-14T08:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising