ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో 4 కరోనా ఆస్పత్రులు

ABN, First Publish Date - 2020-03-26T08:24:55+05:30

కరోనా వైరస్‌ నియంత్రణకు ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే లేబొరేటరీలను విస్తరిస్తున్న ఈ శాఖ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ విమ్స్‌.. తిరుపతి రుయా,విజయవాడ, నెల్లూరు జీజీహెచ్‌ల్లో ఏర్పాటు

వీటిలో 2,400 ఐసొలేషన్‌ వార్డుల గుర్తింపు

అక్కడి సాధారణ రోగులు వేరే వార్డులకు

చాలామందిని ఇళ్లకు పంపిస్తున్న అధికారులు

అత్యవసరమైతేనే ఆస్పత్రికి రావాలని సూచన

కలెక్టర్లు, కమిషనర్లకు మరిన్ని అధికారాలు

నివారణ చర్యల్లో ప్రైవేటు వైద్యులు, సిబ్బందీ..

ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే 188 సెక్షన్‌


అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నియంత్రణకు ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే లేబొరేటరీలను విస్తరిస్తున్న ఈ శాఖ.. ఇప్పుడు ప్రత్యేక కరోనా ఆస్పత్రుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. కరోనా అనుమానితులను గానీ, పాజిటివ్‌ వచ్చినవారిని గానీ సాధారణ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స చేయరాదని కేంద్రం ఆదేశించిన దరిమిలా.. ప్రత్యేకంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 13 జిల్లాలకు అనుకూలంగా ఉండే బోధనాస్పత్రులను గుర్తించింది. విశాఖపట్నంలోని విమ్స్‌, తిరుపతి రుయా, విజయవాడ, నెల్లూరు ప్రభుత్వాస్పత్రులను కరోనాసెంటర్లుగా మార్చారు. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న కొన్ని వార్డులను ఐసొలేషన్‌ వార్డులుగా మారుస్తున్నారు. విమ్స్‌లో 500 పడకలు, విజయవాడలో 650, నెల్లూరులో 650, రుయాలో 600 పడకలు.. మొత్తంగా 2,400 వార్డులను అందుబాటులోకి తెస్తున్నారు. వాటిల్లో సాధారణ రోగులను వేరే వార్డులకు మార్చుతున్నారు. సాధారణ రోగులను అత్యవసరం అనుకుంటేనే ఆస్పత్రుల్లోనే ఉంచుతున్నారు. లేదంటే ఇళ్లకు పంపించేస్తున్నారు. అత్యవసరమైతేనే ఆస్పత్రికి రావాలని.. లేకుంటే ఇళ్లవద్దనే మందులు వాడుకోవాలని చెబుతున్నారు. ఇప్పటికే కరోనా భయంతో కొంతమంది రోగులు ఇళ్లకు వెళ్లిపోయారు. 


కలెక్టర్లకు మరిన్ని అధికారాలు..

కరోనా నివారణ, నియంత్రణకు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లకు ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.  ఏపీ అంటువ్యాధుల చట్టం-1897లో ప్రభుత్వం మరిన్ని నిబంధనలు చేర్చింది. ఆరోగ్య శాఖ కమిషనర్‌, డీఎంఈ, డీహెచ్‌, ఏపీవీవీపీ కమిషనర్‌, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు ఆయా జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.


కరోనా లక్షణాలున్న వ్యక్తులకు డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర నిబంధనల ప్రకారం చికిత్స అందించాలి. ఏదైనా ఒక ప్రాంతంలో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారి.. సదరు వైరస్‌ మరోసారి ఆ ప్రాంతంపై ప్రభావం చూపని విధంగా సంపూర్ణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఈ ఏర్పాట్లు చేయాలి ప్రజారోగ్యం దృష్ట్యా కలెక్టరు ఇచ్చే ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు విధిగా పాటించాలి. ఆ సమయంలో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌, వైద్యులు, నర్సులు. పారామెడికల్‌ సిబ్బంది అందరూ కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొనాలి. రిటైర్డ్‌ మెడికల్‌ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సిబ్బంది కూడా ఇందులో పాలుపంచుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు వైద్యసేవలు అందించాలి. ఈ ఆదేశాలను ధిక్కరించేవారిపై సెక్షన్‌ 188 కింద శిక్షించవచ్చు. ఎటువంటి లీగల్‌ ప్రొసీడింగ్స్‌కు వెళ్లడానికి అవకాశం లేదని ఉత్తర్వులో పేర్కొన్నారు.

Updated Date - 2020-03-26T08:24:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising