ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 లక్షలకు చేరువగా..

ABN, First Publish Date - 2020-10-22T08:55:32+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,422 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 3,746 మందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో కొత్తగా 3,746 కేసులు..

7,93,299కి పెరిగిన పాజిటివ్‌లు

కొవిడ్‌తో మరో 27 మంది మృతి..

6,508కి చేరిన కరోనా మరణాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,422 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 3,746 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,93,299కి చేరుకుంది. రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తూ ర్పుగోదావరి జిల్లాలో 677, కృష్ణాలో 503, చిత్తూరులో 437 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 4,739 మంది కరోనా నుంచి కోలుకోగా రికవరీల సంఖ్య 7,54,415కి పెరిగింది. ప్రస్తుతం 32,376 మంది చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం వరకు రాష్ట్రంలో 72,71,050 శాంపిల్స్‌ పరీక్షించారు. గత 24 గంటల్లో రా ష్ట్రంలో 27 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 6,508కి పెరిగాయి. కృష్ణా జిల్లాలో ఐదుగురు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో ముగ్గురేసి చొప్పున, కడప, శ్రీకాకుళం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలో ఒకొక్కరు చొప్పున మరణించారు. 


కృష్ణాలో మళ్లీ పెరుగుతున్న కేసులు 

కృష్ణా జిల్లాలో మళ్లీ కరోనా అలజడి పెరిగింది. మొన్నటి వరకు 200-300కే పరిమితమైన కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. జిల్లాలో బుధవారం కొత్తగా 503 కేసులు బయటపడ్డాయి. కొవిడ్‌తో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 35,616కి, మ రణాలు 537కి పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో మరో 677 కేసులు బయటపడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లాలో మరో 500 మందికి వైరస్‌ సోకింది. గుంటూరు జిల్లాలో 396 మంది కరోనా బారినపడ్డారు. చిత్తూరులో మరో 437 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో 116 మంది కరోనా బారినపడ్డారు. అనంతపురంలో 301 కేసులు న మోదవగా.. కడపలో 166 కేసులు, క ర్నూలులో 65 మందికి వైరస్‌ సోకింది. విశాఖ జిల్లాలో మరో 138 కేసులు వెలుగుచూశాయి. 

Updated Date - 2020-10-22T08:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising