ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 వేల కోళ్లు మృత్యువాత

ABN, First Publish Date - 2020-02-24T09:32:48+05:30

ఒకటో రెండో కాదు.. ఏకంగా 30 వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. అంతుచిక్కని వైరస్‌ కారణంగా అవి మృతి చెందాయని అనుమానిస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. పె నుబల్లి మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆంధ్రా వైరస్‌ కారణం? 

పెనుబల్లి/ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 23: ఒకటో రెండో కాదు.. ఏకంగా 30 వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. అంతుచిక్కని వైరస్‌ కారణంగా అవి మృతి చెందాయని అనుమానిస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. పె నుబల్లి మండలం నాయకులగూడెం కోళ్లఫాంలో శనివారం వేలాది కోళ్లు మృతి చెందాయన్న విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ నుంచి వచ్చిన వైరస్‌ వల్లే  కోళ్లు  మరణించాయని అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.


నాయకులగూడెం ఏపీకి సరిహద్దులో ఉండగా.. ఇటీవల ఏపీలోనూ అనేక కోళ్లు మృతి చెందాయని, అదే వైరస్‌ ఇప్పుడు తమ ప్రాంతానికి వచ్చిన ఫలితంగానే కోళ్లు మృతిచెంది ఉంటాయనేది స్థానికుల అనుమానం. పెనుబల్లి సరిహద్దులోని కృష్ణాజిల్లాలో అనేక గ్రామాల్లో  కో ళ్ల షెడ్డుల్లోనూ వేలాది సంఖ్యలో మృతి చెందినట్టు స్థానికు లు చెబుతున్నారు. ఏపీలోని తిరువూరు, విసన్నపేట, పుట్ర్యాల, గంపలగూడెం తదితర ప్రాంతాల్లో వైరస్‌ కారణంగా కోళ్లు మృత్యువాత పడటంతో ఆయా గ్రామాల్లో మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధించారని చెబుతున్నారు.


నాయకులగూడెం సమీపంలోని కోళ్లఫాంను ఖమ్మం జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్‌ పురంధర్‌ ఆదివారం పరిశీలించారు. కోళ్లఫాం యజమాని సూర్యదేవర రవికుమార్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పదిరోజులుగా కోళ్లు చనిపోతున్నాయని.. శనివారం వీటి సంఖ్య బాగా పెరిగిందని ఆ అధికారికి వివరించారు. గోతులు తీసి చనిపోయిన కోళ్లను పూడ్చామని చెప్పారు. కోళ్ల నమూనాలను సేకరించి హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపుతామన్నారు. 







Updated Date - 2020-02-24T09:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising