‘ఎల్‌ఆర్‌ఎ్‌స’కు 3 రోజులే గడువు!
ABN, First Publish Date - 2020-12-29T08:48:37+05:30
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లు, అనధికారిక ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది.
- అందిన దరఖాస్తులు 31 వేలు
- మరో 2 వేలు దాఖలవుతాయని అంచనా
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లు, అనధికారిక ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 31వేల దరఖాస్తులు రాగా, గడువు ముగిసేలోగా మరో 1,000- 2,000 దరఖాస్తులు అందే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఎల్‌ఆర్‌ఎస్ కింద అందిన 31 వేల దరఖాస్తుల్లో వివిధ పట్టణాభివృద్ధి సంస్థల (ఉడా) పరిధిలోనివే తొలి 4 స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత అత్యధిక స్థానంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) నిలిచింది. సుమారు 5300 దరఖాస్తులతో ‘గుడా’ ప్రథమ స్థానంలో ఉండగా, 4,700లతో వీఎంఆర్డీయే, 3,700కుపైగా ఏఎంఆర్డీయే, 2,650లతో ‘తుడా’ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సుమారు 1750 దరఖాస్తులతో(జీవీఎంసీ) 5వ స్థానంలో ఉంది.
Updated Date - 2020-12-29T08:48:37+05:30 IST