ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోటకూర ఉండలు

ABN, First Publish Date - 2019-09-21T17:25:19+05:30

తోటకూర - మూడు కట్టలు, సెనగ పిండి - అరకప్పు, పచ్చిమిర్చి - మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌; కారం - అర టీస్పూన్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
తోటకూర - మూడు కట్టలు, సెనగ పిండి - అరకప్పు, పచ్చిమిర్చి - మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌; కారం - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, కొబ్బరి తరుము - ఒక టేబుల్‌స్పూన్‌, నువ్వులు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఎండు మిర్చి - రెండు, ఆవాలు - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, నూనె - సరిపడా.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో తోటకూరను తీసుకుని శభ్రంగా కడిగి కట్‌ చేసుకోవాలి. తరువాత అందులో పచ్చి మిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, జీలకర్ర, సెనగపిండి, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక ఉండలను నెమ్మదిగా వేయాలి. గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేగించుకుంటూ పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో నూనె వేసి ఆవాలు, నువ్వులు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేగించాలి. ఈ మిశ్రమాన్ని వేగించిన పెట్టుకున్న గారెలపై పోసి కలపాలి. కొబ్బరి తురుముతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-09-21T17:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising