ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరటికాయ కోఫ్తా

ABN, First Publish Date - 2019-07-06T14:20:57+05:30

అరటికాయలు - నాలుగు, బంగాళదుంపలు - రెండు, సెనగపిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర పొడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
కోఫ్తా కోసం: అరటికాయలు - నాలుగు, బంగాళదుంపలు - రెండు, సెనగపిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - తగినంత.
గ్రేవీ కోసం: ఉల్లిపాయలు - రెండు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, అల్లం ముక్క - చిన్నది, టొమాటోలు - రెండు, ఆవాల నూనె - 5 టేబుల్‌స్పూన్లు, బిర్యానీ ఆకులు - రెండు, లవంగాలు - నాలుగు, యాలకులు - నాలుగు, పంచదార - ఒక టీస్పూన్‌, కారం - రెండు టీస్పూన్‌, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, ఎండు మిర్చి - రెండు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, మెంతులు - ఒక టీస్పూన్‌, ధనియాలు - నాలుగు టేబుల్‌స్పూన్లు, సోంపు - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
మసాలా దినుసులన్నింటినీ మిక్సీలో వేసి, గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. అరటికాయలను శుభ్రంగా కడిగి, బంగాళదుంపలతో కలిపి కుక్కర్‌లో వేసి ఉడికించుకోవాలి. తరువాత అరటికాయలు, బంగాళదుంపల పొట్టు తీసి, మెత్తగా చిదుముకోవాలి. వీటిపై జీలకర్ర పొడి, మసాల పొడి చల్లి కలపాలి. సెనగపిండి వేసి మెత్తగా అయ్యేలా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో వేగించాలి. గ్రేవీ తయారీ ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్‌ ఆవాల నూనె వేసి పేస్టులా తయారు చేసుకోవాలి.
ఒక పాన్‌ తీసుకొని ఆవాల నూనె వేసి కాస్త వేడి అయ్యాక బిర్యానీ ఆకు, పంచదార వేయాలి. లవంగాలు, దంచిన యాలకులు, ఉల్లిపాయ, అల్లం పేస్టు వేసి వేయించాలి.
కారం, పసుపు, ఉప్పు, మసాల పొడి వేసి కలపాలి. టొమాటో ముక్కలు వేసి కొన్ని నీళ్లుపోసి ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి. తరువాత వేగించి పెట్టుకున్న కోఫ్తాలు వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. టీస్పూన్‌ నెయ్యి, అర టీస్పూన్‌ గరంమసాలా వేసి మరికాసేపు ఉడికించాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకొని దింపుకోవాలి. ఈ కర్రీ రోటీ లేదా అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-07-06T14:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising