ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోకోనట్‌ బర్ఫీ

ABN, First Publish Date - 2019-08-10T20:40:40+05:30

కొబ్బరి తురుము - రెండు కప్పులు, పంచదార - ఒకకప్పు, పాలు - ముప్పావు కప్పు, కుంకుమ పువ్వు రేకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
కొబ్బరి తురుము - రెండు కప్పులు, పంచదార - ఒకకప్పు, పాలు - ముప్పావు కప్పు, కుంకుమ పువ్వు రేకులు - కొన్ని, కోవా - పావు కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, బాదం, జీడిపప్పు - నాలుగైదు పలుకులు.
 
తయారీవిధానం
 
ఒక వెడల్పాటి పాన్‌ తీసుకుని నెయ్యి రాసి పక్కన పెట్టాలి. ఒక చిన్న పాత్రలో రెండు టేబుల్‌స్పూన్ల పాలు తీసుకుని అందులో కుంకుమ పువ్వు రేకులు వేసి ఓవెన్‌లో కొన్ని సెకన్లపాటు వేడి చేయాలి. తరువాత చేత్తో రేకులు నలిపితే పసుపు రంగు వస్తుంది. ఇప్పుడు ఈ పాత్రను పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో కొబ్బరి తురుము, పంచదార, పాలు వేసి బాగా కలియబెట్టాలి. చిన్న మంటపై వేగించాలి. పాలు పూర్తిగా ఆవిరైపోయే వరకు వేగించాలి. తరువాత కుంకుమపువ్వు మిశ్రమం వేయాలి. అలాగే యాలకులపొడి, కోవా వేసి కలియబెట్టుకోవాలి. మరో పదినిమిషాల పాటు వేగించాలి.
ఈ మిశ్రమాన్ని నెయ్యి పూసి పెట్టుకున్న పాన్‌లో పోయాలి. బాదం, జీడిపప్పుతో గార్నిష్‌ చేసుకోవాలి. సమానంగా వచ్చేలా, ముక్కలుగా కట్‌ చేసుకుంటే నోరూరించే కోకోనట్‌ బర్ఫీ రెడీ.

Updated Date - 2019-08-10T20:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising