ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోసకాయ సూప్‌

ABN, First Publish Date - 2019-11-23T14:33:49+05:30

దోసకాయలు - రెండు, పెరుగు - ఒక టేబుల్‌స్పూన్‌, పుదీనా - కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, నిమ్మరసం - రెండు టీస్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి : దోసకాయలు - రెండు, పెరుగు - ఒక టేబుల్‌స్పూన్‌, పుదీనా - కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, చికెన్‌ స్టాక్‌ - రెండు కప్పులు, బ్రెడ్‌ ముక్కలు - రెండు, నూనె - కొద్దిగా, ఛీజ్‌ - కొంచెం.
 
తయారీ విధానం: ముందుగా దోసకాయల పొట్టు తీసి, చిన్నగా కట్‌ చేసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. అందులో చికెన్‌స్టాక్‌, పెరుగు, పుదీనా ఆకులు, వెల్లుల్లిరెబ్బలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లబడే వరకు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత బ్రె డ్‌ని ముక్కలుగా కట్‌ చేయాలి. పాన్‌పై కొద్దిగా వేగించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ ముక్కలపై ఛీజ్‌ రాయాలి. చల్లబడిన సూప్‌ను బౌల్‌లోకి తీసుకుని అందులో పుదీనా ఆకులు, బ్రెడ్‌ ముక్కలు వేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. దోసకాయ సూప్‌లో పెరుగు కలిసి ఉండటం వల్ల కాస్త పుల్ల పుల్లగా బాగుంటుంది.

Updated Date - 2019-11-23T14:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising