ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మసాలా ఆవకాయ

ABN, First Publish Date - 2019-05-25T17:23:47+05:30

మామిడికాయ ముక్కలు - కేజీ, నువ్వుల నూనె - 250 ఎం.ఎల్‌, అల్లం ముద్ద - 125 గ్రాములు, వెల్లుల్లి ముద్ద - 100 గ్రాములు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మామిడికాయ ముక్కలు - కేజీ, నువ్వుల నూనె - 250 ఎం.ఎల్‌, అల్లం ముద్ద - 125 గ్రాములు, వెల్లుల్లి ముద్ద - 100 గ్రాములు, ఉప్పు - 250 గ్రాములు, జీలకర్ర పొడి - 50 గ్రాములు, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్‌లు, గరం మసాల పొడి - టేబుల్‌స్పూన్‌, మెంతిపొడి - టీస్పూన్‌, పసుపు - టేబుల్‌స్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, జీలకర్ర, మెంతులు - టీస్పూన్‌, ఎండుమిర్చి - ఆరు.
 
తయారీవిధానం
 
మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ళ కారం పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఇందులో జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం, వెల్లులి ముద్దలు వేసి కలపాలి. చల్లబడిన తర్వాత మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి కలియబెట్టాలి. ఇందులోనే కొన్ని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర కూడా వేసి మొత్తం బాగా కలిసాక శుభ్రమైన జాడీలోకి ఎత్తిపెట్టుకోవాలి. మామూలు ఆవకాయ కంటే ఇది కాస్త ఘాటుగా ఉంటుంది..

Updated Date - 2019-05-25T17:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising