ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎగ్‌లెస్‌ పైనాపిల్‌ కేక్‌

ABN, First Publish Date - 2019-12-21T19:02:12+05:30

పిండి - రెండు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - రెండున్నర టీస్పూన్లు, వెన్న - అర కప్పు, పంచదార పొడి - ఒకటిన్నర కప్పు, పెరుగు - ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌ - ఒక టీస్పూన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పిండి - రెండు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - రెండున్నర టీస్పూన్లు, వెన్న - అర కప్పు, పంచదార పొడి - ఒకటిన్నర కప్పు, పెరుగు - ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్‌ - ఒక టీస్పూన్‌, ఉప్పు - కొద్దిగా, కేక్‌ టిన్‌ - ఒకటి, పైనాపిల్‌ ముక్కలు - ఒక కప్పు, పైనాపిల్‌ జ్యూస్‌ - మూడు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌ - మూడు కప్పులు, చెర్రీలు - కొన్ని.
 
తయారీ విధానం: ఒక పాత్రలో పిండి, బేకింగ్‌ పౌడర్‌ తీసుకొని ఉప్పు, పంచదార, వెన్న, వెనీలా ఎసెన్స్‌, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. పెరుగు వేసి మిశ్రమం మెత్తగా అయ్యే వరకు కలియబెట్టాలి. తరువాత మిశ్రమాన్ని టిన్‌లోకి మార్చాలి. టిన్‌ను ఓవెన్‌లో 160 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20-25 నిమిషాలు బేక్‌ చేయాలి. క్రీమ్‌, పంచదారను ఒక పాత్రలో కలియబెట్టాలి. మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. ఓవెన్‌లో నుంచి టిన్‌ను బయటకు తీయాలి. మిశ్రమాన్ని ప్లేట్‌లోకి తీసుకుని అడ్డంగా రెండు ముక్కలు చేయాలి. ఇప్పుడు ఒక ముక్కపై క్రీము సమంగా రాయాలి. పైనాపిల్‌ ముక్కలు వేయాలి.
దానిపై మరో ముక్క పెట్టి మళ్లీ అంతటా సమంగా క్రీము పెట్టాలి. పైనాపిల్‌ జ్యూస్‌ అంతటా చల్లాలి. పైనాపిల్‌ ముక్కలు, చెర్రీలతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-12-21T19:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising