ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మటన్‌ రోల్‌

ABN, First Publish Date - 2019-11-16T18:01:52+05:30

మటన్‌ - అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, జీలకర్ర పొడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మటన్‌ - అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒకటిన్నర టీస్పూన్‌, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - ఐదు, నూనె - సరిపడా, చపాతీలు - నాలుగు, కోడిగుడ్లు - నాలుగు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, చాట్‌మసాలా - నాలుగు టీస్పూన్లు.
 
తయారీ విధానం: మటన్‌ను శుభ్రంగా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, నిమ్మరసం, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె వేసి బాగా కలియబెట్టి పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక మటన్‌ ముక్కలు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి అరగంటపాటు ఉడికించాలి. పూర్తిగా నీళ్లు పోయి మిశ్రమం చిక్కగా అయిన తరువాత దింపుకోవాలి. మరొక పాన్‌ తీసుకొని కొద్దిగా నూనె వేసి చపాతీ కాల్చాలి. తరువాత కోడిగుడ్డు కొట్టి వేయాలి. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లి, రెండు వైపులా కాల్చాలి. తరువాత మధ్యలో ఉడికించిన మటన్‌ ముక్కలు పెట్టి, ఉల్లిపాయలు, చాట్‌ మసాల చల్లి రోల్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-11-16T18:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising