బ్రొకోలీ, పాస్తా సలాడ్
ABN, First Publish Date - 2019-06-15T21:46:19+05:30
బ్రొకోలీ - ఒక కప్పు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం ముక్క - చిన్నది, ఉప్పు - తగినంత
కావలసినవి
బ్రొకోలీ - ఒక కప్పు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం ముక్క - చిన్నది, ఉప్పు - తగినంత, కార్న్ - ఒకటిన్నర కప్పు, టొమాటో - ఒకటి, పాస్తా - రెండు కప్పులు, పరమేసన్ చీజ్ - పావుకప్పు.
తయారీవిధానం
బ్రొకోలీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్లలో కాసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాస్తాను ఉడికించాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం వేయాలి. అందులో కార్న్ వేసి వేగించాలి. బ్రొకోలీ వేసి మరికాసేపు వేగించాలి. తర్వాత టొమాటో వేయాలి. తగినంత ఉప్పు వేసి కలపాలి. ఛీజ్ వేసి స్టవ్‌పై నుంచి దింపితే పాస్తా రెడీ.
Updated Date - 2019-06-15T21:46:19+05:30 IST