ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్మా చావల్‌

ABN, First Publish Date - 2019-06-15T21:43:46+05:30

రాజ్మా- రెండు కప్పులు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - టీస్పూన్‌, దాల్చిన చెక్క - కొద్దిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
రాజ్మా- రెండు కప్పులు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - టీస్పూన్‌, దాల్చిన చెక్క - కొద్దిగా, యాలకులు - రెండు, లవంగాలు - మూడు, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - ఒకటి, అల్లం - చిన్నముక్క, కారం - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - టీ స్పూన్‌, జీలకర్రపొడి - టీ స్పూన్‌, గరంమసాల - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒకకట్ట.
 
తయారీవిధానం
 
రాజ్మాను రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తీసేసి, కుక్కర్‌లో ఉడికించుకోవాలి. మూడు, నాలుగు విజిల్స్‌ వచ్చిన తరువాత చిన్నమంటపై మరో పదినిమిషాలు ఉడికించాలి. ఉల్లిపాయలు, టొమాటో, అల్లం ముక్కను మిక్సీలో వేసి పట్టుకోవాలి. ఒకపాత్రను తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, పసుపు వేయాలి. తరువాత మిక్సీలో పట్టుకున్న మిశ్రమం వేయాలి. కొద్దిసేపు వేగించాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క పొడి చేయాలి. వీటితో పాటు జీలకర్రపొడి, గరంమసాల, ధనియాల పొడి వేసి కలియబెట్టుకోవాలి. అందులో రాజ్మా వేసి మరికాసేపు ఉడికించి స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. ఈ రాజ్మాను అన్నంలో కలిపితే రాజ్మా చావల్‌ సిద్ధం.

Updated Date - 2019-06-15T21:43:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising