ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాక్‌లెట్‌ కప్‌కేక్స్‌

ABN, First Publish Date - 2019-04-20T15:53:27+05:30

కోకో పౌడర్‌ - అరకప్పు, కోడిగుడ్డు - ఒకటి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్‌, పిండి - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - ఒకటిన్నర టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - ఒకటిన్నర టీస్పూన్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
కోకో పౌడర్‌ - అరకప్పు, కోడిగుడ్డు - ఒకటి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్‌, పిండి - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - ఒకటిన్నర టీస్పూన్‌, బేకింగ్‌ సోడా - ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, వెన్న - మూడు టేబుల్‌స్పూన్లు, డార్క్‌ బ్రౌన్‌ షుగర్‌ - ముప్పావు కప్పు, పాలు - పావు కప్పు, యాపిల సాస్‌ - పావుకప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు, మఫిన్‌ కప్పులు - 12.
 
తయారీవిధానం
 
ముందుగా ఒకపాత్రలో పిండి తీసుకొని కోకో పౌడర్‌, సోడా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. మరొక పాత్రలో క్రీమ్‌, వెన్న, పంచదార తీసుకుని అన్ని పదార్థాలు కలిసేలా కలియబెట్టాలి. కోడిగుడ్డు కొట్టి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. వెనీలా కూడా వేసి కలుపుకోవాలి. రెండు మిశ్రమాలు కలపాలి. మిశ్రమాలు బాగా కలిసేందుకు పాలు పోయాలి. ఈ మిశ్రమాన్ని మఫిన్‌ కప్పులలో నింపాలి. ఓవెన్‌లో 20 నిమిషాల పాటు ఉంచాలి. ఓవెన్‌లో నుంచి తీశాక అరగంట పాటు చల్లార్చాలి. తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-04-20T15:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising