ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకడో సలాడ్‌

ABN, First Publish Date - 2019-03-23T21:01:01+05:30

నిమ్మరసం - 3 టేబుల్‌ స్పూన్లు, ఆలివ్‌ ఆయిల్‌- 3 టేబుల్‌ స్పూన్లు, తేనె- 2 టేబుల్‌ స్పూన్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
నిమ్మరసం - 3 టేబుల్‌ స్పూన్లు, ఆలివ్‌ ఆయిల్‌- 3 టేబుల్‌ స్పూన్లు, తేనె- 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ -1 (సన్నగా తరగాలి), మిరపకాయ -1 (సన్నగా తరగాలి), ఉప్పు, నల్ల మిరియాల పొడి- తగినంత, అవకడో- రెండు (ముక్కలుగా కోయాలి), పీచెస్‌ లేదా ఆపిల్స్‌ - 3 (ముక్కలుగా కోయాలి), గార్నిష్‌ కోసం పుదీనా ఆకులు- ఒక కప్పు, పిస్తా పప్పు- పావు కప్పు (సన్నగా తరగాలి)
 
తయారీవిధానం
 
నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌, తేనె, ఉల్లిపాయలు, మిరపకాయ ముక్కల్ని ఒక గిన్నెలో బాగా కలపాలి. ఆ మిశ్రమంపై ఉప్పు, నల్ల మిరియాల పొడి చల్లాలి. తర్వాత అందులో పీచెస్‌ లేదా ఆపిల్‌ ముక్కలను వేసి బాగా కలపాలి. 15 నిమిషాల నుంచి గంట సేపు అలాగే ఉంచితే మిశ్రమం ఆ ముక్కలకు బాగా పట్టుకుంటుంది. సర్వ్‌ చేసే ముందు అందులో అవకడో ముక్కలు కలిపి దానిపై పుదీనా, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. అలంకరణగా పిస్తాపప్పును వాడితే చూడటానికే కాదు రుచి కూడా అదుర్స్‌.

Updated Date - 2019-03-23T21:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising