ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కజొన్న గారెలు

ABN, First Publish Date - 2019-07-20T21:07:13+05:30

మొక్కజొన్నలు - రెండున్నర కప్పులు, ఎండుమిర్చి - పదిహేను, ధనియాలపొడి - ఒక టేబుల్‌స్పూన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మొక్కజొన్నలు - రెండున్నర కప్పులు, ఎండుమిర్చి - పదిహేను, ధనియాలపొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి రెబ్బలు - పదిహేను, ఉల్లిపాయలు - రెండు, పసుపు - ఒక టీస్పూన్‌, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - తగినంత.
 
తయారీవిధానం
 
మిక్సీలో మొక్కజొన్నలు, ఎండుమిర్చి, ధనియాలపొడి, ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు వేసి, గ్రైండ్‌ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చా ఉండేలా పట్టుకోవాలి. నీళ్లు పోయకూడదు. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకొని, బియ్యం పిండి వేసి బాగా కలపాలి. ఒక పాన్‌లో నూనె వేసి, వేడి అయ్యాక కార్న్‌ మిశ్రమాన్ని చిన్న చిన్న గారెలుగా చేసుకుంటూ నూనెలో వేగించాలి. గారెలకు కావాలనుకుంటే వేలితో మధ్యలో చిన్న రంధ్రం చేసుకోవచ్చు. మొక్కజొన్న గారెలను వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2019-07-20T21:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising