ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకాడో రోల్స్‌

ABN, First Publish Date - 2019-11-16T17:53:03+05:30

ఉడకబెట్టిన సెనగలు - పావు కిలో, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, తాహిని - ఒక టీస్పూన్‌, నిమ్మకాయలు - రెండు, కర్రీ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, క్యాబేజీ - ఒకటి, కీరదోస - ఒకటి, ఉల్లిపాయలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన సెనగలు - పావు కిలో, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, తాహిని - ఒక టీస్పూన్‌, నిమ్మకాయలు - రెండు, కర్రీ పౌడర్‌ - ఒక టీస్పూన్‌, క్యాబేజీ - ఒకటి, కీరదోస - ఒకటి, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - రెండు, అవకాడో - ఒకటి, గోధుమపిండి - పావుకేజీ, ఎండిన మెంతి ఆకులు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌.
 
తయారీ విధానం:
ఉడకబెట్టిన సెనగలు, వెల్లుల్లి రెబ్బలు, తాహిని, నిమ్మరసం, కర్రీ పౌడర్‌ను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. తరువాత గోధుమపిండిలో ఉప్పు, జీలకర్ర, మెంతి ఆకులు వేసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చేతిలో నెయ్యి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా చేయాలి. ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి క్యాబేజీ, కీరదోస, ఉల్లిపాయ, టొమాటో, అవకాడో ముక్కలను వేసి వేగించాలి. తగినంత ఉప్పు, నిమ్మరసం వేయాలి. కొద్దిగా కారం చల్లుకోవాలి. చపాతీ మధ్యలో గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మిశ్రమం, వేగించి పెట్టుకున్న క్యాబేజీ, కీరదోస, అవకాడో ముక్కల మిశ్రమం పెట్టి రోల్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-11-16T17:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising