ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునగకాయ మాంసం

ABN, First Publish Date - 2019-09-07T18:58:43+05:30

మాంసం - అరకేజీ, మునగకాయలు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, ధనియాల పొడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మాంసం - అరకేజీ, మునగకాయలు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కారం - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, గసగసాలు - ఒక టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, నూనె - తగినంత, లవంగాలు - ఐదు, దాల్చినచెక్క - చిన్నముక్క, యాలకులు - రెండు.
 
తయారీవిధానం
 
మునగకాయల పైపొట్టు తీసి కట్‌ చేయాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాసేపు వేగించి పక్కన పెట్టుకోవాలి. గసగసాలు కూడా వేగించాలి. ఇప్పుడు కుక్కర్‌ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. కాసేపు వేగిన తరువాత మాంసం వేసి కలియబెట్టాలి. కాసేపయ్యాక కారం, పసుపు, ధనియాల పొడి, గసగసాలు, తగినంత ఉప్పు వేసి కలిపి, చిన్నమంటపై పది నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టాలి. మూడు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత కుక్కర్‌ మూత తీసి గరంమసాల పొడి, మునగకాయ ముక్కలు వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై కాసేపు ఉడకనిచ్చి, దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-09-07T18:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising