ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునక్కాడల కూటు కర్రీ

ABN, First Publish Date - 2018-03-31T21:29:21+05:30

మునక్కాడ - ఒకటి (ముక్కలు చేసి), పచ్చిమామిడికాయ - ఒకటి (తొక్కు తీసి, కాస్త పెద్దముక్కలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మునక్కాడ - ఒకటి (ముక్కలు చేసి), పచ్చిమామిడికాయ - ఒకటి (తొక్కు తీసి, కాస్త పెద్దముక్కలు తరిగి), పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు - రుచికి సరిపడా, మినపగుండ్లు - అర కప్పు (అరగంట నానబెట్టాలి), పసుపు - పావు టీస్పూను, మంచి నీళ్లు- కొన్ని.
కొబ్బరి పేస్టు కోసం: తాజా కొబ్బరి తరుగు - పావు కప్పు, జీలకర్ర - ఒక టీస్పూను, పచ్చిమిర్చి - రెండు, నీళు ్ల- రెండున్నర టేబుల్‌స్పూన్లు.
తాలింపు కోసం: నూనె - ఒకటిన్నర స్పూను, ఆవాలు, మినపగుండ్లు ఒక్కొక్కటీ పావు టీస్పూను చొప్పున, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు- ఒక రెబ్బ.
 
తయారీవిధానం
 
మునక్కాడ ముక్కలు, మినప గుండ్లు, మామిడిముక్కలు, రెండు కప్పుల నీళ్లు, ఉప్పు, పసుపు అన్నింటినీ కలిపి కుక్కర్‌లో నాలుగు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించాలి.
కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, నీళ్లు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పప్పు, మునక్కాడలు, మామిడికాయ మిశ్రమంలో కొబ్బరి కలిపి నాలుగు నిమిషాలు ఉడికించాలి. తగినంత ఉప్పు వేయాలి. నూనె వేడిచేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు వేస్తే కర్రీ రెడీ.

Updated Date - 2018-03-31T21:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising