ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడక్‌నాథ్‌ కంట్రీ చికెన్‌ పాట్‌ బిర్యానీ

ABN, First Publish Date - 2018-10-06T18:49:59+05:30

కడక్‌నాథ్‌ కంట్రీ చికెన్‌, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, నీళ్లు, వెల్లుల్లి, అల్లం, బియ్యం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
కడక్‌నాథ్‌ కంట్రీ చికెన్‌, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, నీళ్లు, వెల్లుల్లి, అల్లం, బియ్యం, నూనె, పచ్చిమిర్చి, బిర్యానీ మసలా దినుసులు, అల్లం-వెల్లుల్లి పేస్టు, ధనియాలపొడి, బిరియాని ఆకులు, కొత్తిమీర-గుప్పెడు.
 
తయారీవిధానం
 
చికెన్‌ని నీళ్లతో శుభ్రంగా కడగాలి. కుక్కర్‌లో చికెన్‌తోపాటు కరివేపాకు, ఉప్పు, పసుపు, ఉల్లిపాయముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాలి.
బియ్యాన్ని నానబెట్టి రెడీగా పెట్టుకోవాలి. అల్లం-వెల్లుల్లి పేస్టును సిద్ధంచేసుకోవాలి.
బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఒక మట్టి కుండను తీసుకుని స్టవ్‌ మీద వేడిచేయాలి.
కుండ వేడెక్కిన తర్వాత అందులో నూనె లేదా నెయ్యి వేసి బిర్యానీ మసాలా దినుసులు వేగించాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. బియ్యంకొలతకు సరిపడా తగినన్ని నీళ్లు ఆ పేస్టులో పోసి, ఉప్పు వేసి మూతపెట్టి ఆ నీళ్లను మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో పోసి పది నిమిషాలు ఉడికించాలి. బియ్యం పొడిపొడిగా ఉండేలా ఉడికిన తర్వాత రెడీగా పెట్టుకున్న కడక్‌నాథ్‌ చికెన్‌ని అందులో వేసి మూతపెట్టాలి.
అందులోని నీళ్లు పూర్తిగా ఆవిరయ్యే దాకా సన్నని మంటపై బిర్యానీని ఉడకనిచ్చి తర్వాత స్టవ్‌ నుంచి దించాలి. పాట్‌ బిర్యానీపైౖ కొత్తిమీర చల్లి వేడిగా తింటే చాలా బాగుంటుంది.


Updated Date - 2018-10-06T18:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising