ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మకెరల్‌ ఫ్రై

ABN, First Publish Date - 2018-01-20T21:49:15+05:30

మీడియం సైజులో ఉండే మకెరల్‌ చేపలు- రెండు (బాగా శుభ్రంచేయాలి), అల్లంవెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
మీడియం సైజులో ఉండే మకెరల్‌ చేపలు- రెండు (బాగా శుభ్రంచేయాలి), అల్లంవెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర టేబుల్‌స్పూను, కారం- ఒకటిన్నర టీస్పూను, పసుపు- ఒక టీస్పూను, నిమ్మరసం- ఒక టేబుల్‌స్పూను లేదా వెనిగర్‌- అర టేబుల్‌స్పూను, ఉప్పు-తగినంత, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, అలంకరణకు- గుండ్రంగా తరిగిన నిమ్మకాయ ముక్కలు.
 
తయారీవిధానం
 
చేపలను ఒకే సైజులో ముక్కలుగా కట్‌ చేయాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, నిమ్మరసం లేదా వెనిగర్‌, ఉప్పు అన్నింటినీ ఒక పాత్రలో వేసి బాగా కలపాలి.
చేపముక్కలకు ఈ మిశ్రమం బాగా పట్టేలా కలిపి పది నిమిషాలు అలాగే నాననివ్వాలి.
పాన్‌లో నూనె వేసి బాగా వేడెక్కనివ్వాలి. మకెరల్‌ ముక్కను వేడి నూనెలో వేసి ఆ చేప ముక్క రెండు వైపులా బంగారు వర్ణంలో వచ్చేదాకా వేగించాలి. సన్నని మంటపై దీన్ని వేగించాలి. చేపముక్క ఒకవైపు నాలుగునిమిషాలు కాల్చాలి. అది బంగారువర్ణంలోకి వచ్చిన తర్వాత రెండవవైపుకు తిప్పి దాన్ని కూడా బంగారువర్ణంలోకి వచ్చేదాకా నూనెలో కాలనివ్వాలి. ముక్కను తిప్పేటప్పుడు విడిపోకుండా జాగ్రత్తగా తీయాలి.
వేగిన ఈ చేపముక్కలపై కొద్దిగా నిమ్మరసం చల్లుకుని వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-01-20T21:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising