ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్లేజ్‌డ్‌ డోనట్స్‌

ABN, First Publish Date - 2018-12-22T18:26:11+05:30

చిక్కని పాలు - 1 కప్పు, చక్కెర - పావు కప్పు డ్రై ఈస్ట్‌ - 2 1/4 టీ స్పూను, గుడ్లు - 2 (గిలక్కొట్టుకోవాలి), కరిగించిన బటర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
చిక్కని పాలు - 1 కప్పు, చక్కెర - పావు కప్పు డ్రై ఈస్ట్‌ - 2 1/4 టీ స్పూను, గుడ్లు - 2
(గిలక్కొట్టుకోవాలి), కరిగించిన బటర్‌ - 10 టేబుల్‌ స్పూన్లు, మైదా - 4 కప్పులు, ఉప్పు - అర టీస్పూను, నూనె - వేపుడుకు సరిపడా.
 
గ్లేజ్‌ కోసం
కరిగించిన సాల్టెడ్‌ బటర్‌ - 4 టేబుల్‌ స్పూన్లు, వెనిల్లా - 1 టీస్పూను, చక్కెర పొడి - 3 కప్పులు
 
గ్లేజ్‌ తయారీ
గ్లేజ్‌ కోసం చెప్పిన పదార్థాలన్నిటినీ గిన్నెలో వేసి కలుపుకోవాలి.
వేయించి పెట్టుకున్న డోనట్స్‌ను ఈ మిశ్రమంలో ముంచి తీసి గ్రిల్‌ మీద ఉంచాలి.
ఇలా చేస్తే, అదనంగా ఉన్న పాకమంతా కారిపోతుంది.
డోనట్స్‌ చల్లారేసరికి పాకం వాటి మీద పొరలా పేరుకుని, చక్కని మెరుపుతో నోరూరిస్తాయి.
 
 
తయారీవిధానం
 
పాలు వేడి చేసి, చక్కెర వేసి కరిగేవరకూ తిప్పాలి. దీన్లో ఈస్ట్‌ వేసి కలిపి ఐదు నిమిషాలపాటు పక్కనుంచాలి. దీన్లో గిలక్కొట్టిన గుడ్లు, కరిగించిన వెన్న వేసి బాగా కలపాలి. తర్వాత మైదా, ఉప్పు వేసి పిండి ముద్దగా మారేవరకూ కలపాలి. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాలపాటు కదిలించకుండా ఉంచాలి. తర్వాత ఈ పిండి ముద్దను నూనె పూసిన గిన్నెలోకి మార్చుకుని, మూతపెట్టి 8 గంటలపాటు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత పిండిని అర అంగుళం మందంగా ఒత్తుకుని, 3 అంగుళాల డోనట్‌ కట్టర్‌తో డోనట్స్‌ కట్‌ చేసుకోవాలి. ఈ డోనట్స్‌ మధ్యలో సీసా మూతతో గుండ్రంగా రంథ్రం చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డోనట్స్‌ను వెన్న పూసిన బేకింగ్‌ షీట్‌ మీద పరిచి, అవి ఉబ్బేవరకూ మూతపెట్టి, గంటపాటు పక్కనుంచాలి. తర్వాత నూనె కాచి, మీడియం మంట మీద డోనట్స్‌ను బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి.

Updated Date - 2018-12-22T18:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising