ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లం-వెల్లుల్లి ఊరగాయ

ABN, First Publish Date - 2018-04-29T20:55:10+05:30

పచ్చిమామిడికాయముక్కలు- నాలుగు కప్పులు, ఆవపిండి- ఒక కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి
 
పచ్చిమామిడికాయముక్కలు- నాలుగు కప్పులు, ఆవపిండి- ఒక కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్టు- ఒక కప్పు, కారం- ఒక కప్పు, ఉప్పు- ఒక కప్పు కన్నా కొద్దిగా తక్కువ (అంటే మూడు టేబుల్‌స్పూన్లు), నువ్వుల నూనె- ఒకటిన్నర కప్పు.
 
తయారీవిధానం
 
మామిడికాయలను నీళ్లతో బాగా కడిగి పొడి బట్టతో శుభ్రంగా తుడవాలి. తర్వాత ముక్కలుగా చేయాలి. టెంకెతో పాటు కొట్టిన ఈ మామిడి ముక్కలను తుడిచి ఆరబెట్టాలి. అల్లం, వెల్లుల్లిని సమపాళ్లలో తీసుకొని ఒక కప్పు పేస్టును రెడీ చేసుకోవాలి.
జాడీ పొడిగా ఉండాలి. మిక్సీలో ఆవాలను వేసి పొడి చేయాలి. పెద్ద పాత్రను తీసుకుని అందులో ఆవపిండి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో అల్లం-వెల్లుల్లి పేస్టు కూడా కలపాలి. ఈ మసాలాలో రెడీగా పెట్టుకున్న మామిడికాయముక్కల్ని వేసి ముక్కలకు మసాలా బాగా పట్టేలా చేత్తో కలపాలి. ఊరగాయముక్కల్లో ఒకటింబావు కప్పు నూనె వేసి కలపాలి. ఊరగాయముక్కలతోపాటు మిగిలిన మసాలాను కూడా జాడీలో వేయాలి. పావు కప్పు నూనెను ముక్కలపై పోసి మూడు రోజులు అలాగే ఉంచాలి. తొలిరోజు ఊరగాయ ముక్కల మీద నూనె తేలిందీ లేనిదీ గమనించాలి.
ఊరగాయ ఉప్పగా ఉన్నట్టు అనిపిస్తే మరో రెండురోజులపాటు ముక్కలను ఊరనివ్వాలి.
ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తే ఒకటి లేదా రెండు టీస్పూన్ల ఉప్పును కలపాలి. మూడవ రోజు కూడా ఊరగాయను ఇలాగే గమనించాలి. రెడీ అయిన ఊరగాయను గాలిచొరబడని జాడీలో నిల్వచేయాలి.

Updated Date - 2018-04-29T20:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising